Introduction

AI-NFT అంటే ఏమిటి?

AI-NFT అంటే కేవలం NFT ఇమేజ్‌ను AI ఏజెంట్‌కు అటాచ్ చేయడం మాత్రమే కాదు. AI-NFT AI ఏజెంట్‌లను ట్రాన్స్ఫర్ చేయగల, ట్రాక్ చేయగల మరియు క్లయింట్‌ల నుండి స్వతంత్రంగా పనిచేయగల నిజమైన అసెట్‌గా మారుస్తుంది.

లోకల్, క్లౌడ్ లేదా TEEలో ఇన్‌స్టాల్ చేయబడిన Eliza (AI16Z ద్వారా ప్రసిద్ధ AI ఫ్రేమ్‌వర్క్)తో మీరు AI-NFT వెనుక ఉన్న AI ఏజెంట్‌ను ఏ వాతావరణంలోనైనా అమలు చేయవచ్చు, అదే సమయంలో వాటి పనితీరును స్థిరంగా ఉంచవచ్చు.

మనకు AI-NFT ఎందుకు అవసరం

ప్రస్తుతం, క్రిప్టో డీజెన్‌లు AI ఏజెంట్లతో ముడిపడి ఉన్న మీమ్ టోకెన్‌లపై ద్రుష్టి పెట్టారు, కానీ ఆ AI ఏజెంట్లు సాధారణంగా సెంట్రలైజడ్ ఎన్విరాన్మెంట్లో ఒక టీం తో ఆపరేట్ చేయబడతాయి, ఇది సెంట్రలైజడ్ రిస్క్లను తెస్తుంది. అంతే కాకుండా, AI ఏజెంట్ల ద్వారా వచ్చే లాభాల యాజమాన్యం అస్పష్టంగా ఉంటుంది. ఈ AI ఏజెంట్లను సాధారణంగా " పబ్లిక్ గూడ్స్"గా పరిగణిస్తారు మరియు వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా వారికి అనుకూలీకరించిన వర్క్‌ఫ్లోలను కేటాయించలేరు.

మీ దెగ్గర మీ స్వంత AI ఏజెంట్‌ ఉంటె, మీ అనుమతితో మాత్రమే ఆన్-చైన్ ట్రేడింగ్, ఎయిర్‌డ్రాప్‌లను క్లెయిమ్ చేయడం మరియు అసెట్లను ట్రాన్స్ఫర్ చేయడం వంటి తెలివైన, ఆటోమేటెడ్ పనులను నిర్వహించగలిగితే, దాని అసెట్లను మ్యానేజ్ చేయగల మరియు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ విత్డ్రా చేయగల ఏకైక వ్యక్తిగా కూడా ఉంటే, అది ప్రొఫెషనల్ డెవలపర్‌లలో మాత్రమే కాకుండా సాధారణ వినియోగదారులలో AI ఏజెంట్ల స్వీకరణను పెంచుతుంది.

కాబట్టి మేము AI-NFT ని ప్రవేశపెట్టాము, అంటే బ్లాక్‌చెయిన్‌లో NFT లుగా AI ఏజెంట్లను డిప్లాయ్ చేయడం. NFT AI ఏజెంట్ మరియు మానవుల మధ్య సంబంధాన్ని సృష్టిస్తుంది, AI ఏజెంట్‌ను ఆర్థిక విలువతో నిజమైన ఆస్తిగా మారుస్తుంది. మీ దెగ్గర AI-NFT ఉంటె, మీ దెగ్గర AI ఏజెంట్ ఉన్నారు.

xNomad అంటే ఏమిటి?

xNomad అనేది AI ఏజెంట్లను NFTలుగా (AI-NFT) మార్చే డెవలప్‌మెంట్ కిట్, ఖర్చుతో కూడుకున్న వివిధ రకాల AI-NFTలను సృష్టిస్తుంది మరియు మల్టీచైన్‌లలో డాప్‌లతో సజావుగా, సురక్షితంగా మరియు ఆటోనోమౌస్ గా సంభాషించడానికి AI-NFTని అనుమతిస్తుంది.

ప్రతి AI-NFT ఈ ఉత్తేజకరమైన లక్షణాలను కలిగి ఉంది:

  • @ai16zdao రాసిన Eliza ఆధారంగా, ప్రతి NFT ఒక ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ మరియు వ్యక్తిత్వంతో కూడిన స్వతంత్ర AI ఏజెంట్.

  • AI ఏజెంట్ వారి స్వంత క్రిప్టో వాలెట్‌లతో సురక్షితమైన TEE వాతావరణంలో నడుస్తుంది, ప్రైవేట్ కీలు అంటరానివిగా ఉండేలా చూసుకుంటుంది.

  • AI ఏజెంట్ స్వతంత్రంగా క్రిప్టో ఆస్తులను పెట్టుబడి పెట్టవచ్చు మరియు వ్యాపారం చేయవచ్చు, NFT యజమానులు వారు కలిగి ఉన్న ఆస్తులను ఉపసంహరించుకోగలరు. AI-NFT విలువ దాని AI ఏజెంట్ ఆస్తులతో పెరుగుతుంది.

  • ప్రతి AI-NFT దాని లక్షణాల ఆధారంగా ప్రత్యేకమైన వ్యక్తిత్వం మరియు కమ్యూనికేషన్ శైలిని కలిగి ఉంటుంది.

  • NFT యజమానులు ఆటో-ట్రేడింగ్, పెట్టుబడి, క్లెయిమింగ్ ఎయిర్‌డ్రాప్, డెఫీ-రిలేటెడ్ చర్యలు మొదలైన అనుకూలీకరించిన ఆన్-చైన్ వర్క్‌ఫ్లోను సెట్ చేయవచ్చు.

  • AI ఏజెంట్ టెలిగ్రామ్, ట్విట్టర్ బాట్‌లు మరియు లైవ్ స్ట్రీమ్ వంటి సామాజిక ప్లాట్‌ఫారమ్‌లకు కూడా కనెక్ట్ కావచ్చు.

AI-NFT కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. AI-NFTలు కేవలం సేకరణలు మాత్రమే కాదు—అవి ఆన్-చైన్ ట్రేడింగ్, ఎయిర్‌డ్రాప్‌లను క్లెయిమ్ చేయడం, ఆస్తులను నిర్వహించడం మరియు మరిన్నింటి వంటి పనులను ఆటోమేట్ చేయగలవు—అన్నీ మీ అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించబడతాయి.

  2. AI-NFT నుండి వచ్చే అన్ని ఆస్తి లాభాలు మరియు ఆదాయాలను దాని యజమాని క్లెయిమ్ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు.

  3. AI-NFTలు బదిలీ చేయబడతాయి. AI-NFT వద్ద ఉన్న ఆస్తుల విలువ దాని స్వంత మార్కెట్ విలువలో ప్రతిబింబిస్తుంది.

  4. పూర్తిగా డిసెంట్రలైజ్డ్ AI ఏజెంట్లు వారి కార్యాచరణ మరియు అసెట్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారిస్తారు, సేవా ప్రదాతలు అదృశ్యమయ్యే ప్రమాదం లేదు.

  5. మీరు ఊహించగలిగే దానికంటే ఎక్కువ...

Last updated

Was this helpful?